సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టరు ఆకస్మిక తనిఖీలు
1 min read
నిరుపేద రోగులు ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ పై నమ్మకం పెరిగేలా మెరుగైన వైద్య సేవలందించాలి
అన్ని డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్ లో జరగాలి, సుఖప్రసవాలకు మొదటి ప్రాధాన్యను ఇవ్వాలి
కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జనరల్ ఓపి, రక్త పరీక్ష గది, ఎముకల ఓపి,ఓపీ రిజిస్ట్రేషన్, స్త్రీలు వార్డు,పురుషులు వార్డు, బ్లడ్ బ్యాంకు, తదితర వార్డులు పరిశీలించి పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్యసేవలుపై అభిప్రాయాలు తెలుసుకుని, జిల్లా కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. 50 పడకల హాస్పటల్ పనిచేసే వారి వివరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటరు ప్రగతి సూచిక బోర్డులను పరిశీలించి వివరాలను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు మంచి వైద్యసేవలు అందించి రోగులలో నమ్మకాన్ని పెంపొందించు కోవాలని అన్నారు. నిరుపేద రోగులు ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ లో మంచి సర్వీసులు అందించాలని సూచించారు. అన్ని డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్ లో జరగాలని, సుఖప్రసవాలకు మొదటి ప్రాధాన్యను ఇవ్వాలని అన్నారు.ఈ తనిఖీలో ఇంచార్జి ఆర్డీవో ఐ.కిషోరు,హాస్పిటల్ సూపర్డెంటు డా.కె.శ్వేత, వైద్యులు,ఏఎన్ యంలు,వైద్యసిబ్బంది,పేషెంట్లువారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

