మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయండి
1 min read
ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఎమ్మెల్యేకు వినతి..
నందికొట్కూరు న్యూస్ నేడు: గత కొన్నేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నా మా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఇప్పటికైనా పరిష్కరించాలని కోరుతూ నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను కలసి జేఏసీ పిలుపుమేరకు ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం సాయంత్రం అల్లూరులో ఎమ్మెల్యేను కలసి విన్నవించారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని సిహెచ్సి,పిహెచ్సిలో(స్టాఫ్ నర్స్,ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ etc) పనిచేస్తున్న తాలూకా జేఏసీ కమిటీ నాయకులు సౌజన్య,రాధా,ఈశ్వరయ్య, నవీన్ ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చాలాసార్లు మా సమస్యల గురించి విన్నవించినా కూడా స్పందన లేదని ఈ ఏడాది జూన్ 17న విజయవాడలో రాష్ట్ర వ్యాప్త ధర్నా చేసి అధికారులకు విన్నవించడం జరిగిందన్నారు.కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.వంద శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలి.విధి నిర్వహణలో మరణించిన కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా,ఈపీఎస్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంధ్య,ముర్తు జావలి, లక్ష్మన్న,అశోక్,సునీత తదితరులు పాల్గొన్నారు.


