మదనపల్లె లో ఎఫ్ పి షాప్ లు, ఎం ఎల్ ఎస్ పాయింట్ తనిఖీ
1 min read
సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి
మదనపల్లె ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం ప్రతినిధి ) : మదనపల్లె పట్టణం లోని చౌక దుకాణా లను, ఎం ఎల్ ఎస్ పాయింట్ ను మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తనిఖీ చేశారు. బుధవారం చౌక దుకాణాల తనిఖీలో స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ రిజిస్టర్లు, ఇతర చట్టబద్ధమైన రికార్డుల ధృవీ కరణ, సరసమైన ధర దుకాణం లో అందు బాటులో ఉన్నది, లేనిది, స్టాక్ భౌతిక ధృవీకరణతో పాటు రికార్డులతో పోల్చి సరి చూడ టం జరిగింది.అదే క్రమంలో లబ్ధి దారులకు పంపిణీ ప్రక్రియపై సమీక్ష చేశారు. లబ్దిదారు లతో పరస్పరం సంప్రదించి పంపిణి పైన, దుకాణం పనితీరుకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను సేక రించారు. అనంతరం మండల స్థాయి స్టాక్ పాయింట్ తనిఖీ చేశారు. మండల స్థాయి స్టాక్ పాయింట్ రికార్డుల తనిఖీ, రిజిస్టర్ల నిర్వహణ, గోడౌన్ లో అందు బాటులో ఉన్న స్టాక్ ధృవీ కరణ, అవసరమైన వస్తువులను సేకరించి నిల్వ చేయడం, పంపిణీ చేయడం గురించి సమీక్షించారు. గోడౌన్‌లో స్టాక్ నిల్వ పద్ధతిని పరిశీలించారు.హమాలీ లతో లోడింగ్, అన్‌లోడ్ చేసే కార్మికులు, కాంట్రాక్టర్ వివరాల ధృవీకరణ, రవాణా ఏర్పాట్ల పైన సబ్ కలెక్టర్ పరిశీ లించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఎస్ డి టి ఫిరోజ్ ఖాన్, మరియు సిబ్బంది పాల్గొ న్నారు.


