NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వం  కల్పించిన వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి

1 min read

బకాయిలు తిరిగి చెల్లించినవారికి వడ్డీ మాఫీ

ప్రభుత్వం వారు కల్పించిన వడ్డీ మాఫీ అవకాశన్ని లబ్ధిదారులు సద్వినియోగo చేసుకోవాలి

ఎస్పీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఎస్సీ కార్పొరేషన్  ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా రుణ బకాయిలు తిరిగి చెల్లించినవారికి వడ్డీ  మాఫీ చేయడం జరుగుతుందని ఎస్పీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి చెప్పారు. ఎస్పీ కార్పొరేషన్ ద్వారా 2015-16 నుండి 2018-19 వరకు NSFDC / NSKFDC పధకముల క్రింద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు లబ్ది పొందిన లబ్దిదారులు బకాయిలను ఈనెల 30వ తేదీలోగా  చెల్లించిన  వారికి వడ్డీ మాఫీ చేయబడుతుందన్నారు.     బకాయిదారులు త్వరితగతిన అసలు ఋణమును చెల్లించి ప్రభుత్వం వారు కల్పించిన వడ్డీ మాఫీ అవకాశమును సద్వినియోగము చేసుకొనవలసినదిగా ముక్కంటి కోరారు.లబ్దిదారులు ఋణము చెల్లించుటలో విఫలమైతే హమీదారుల జీత భత్యముల నుండి గాని, చట్టపరమైన చర్యల ద్వారా గాని వసూలు చేయడం జరుగుతుందని ముక్కంటి తెలియజేసారు.

About Author