NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం

1 min read

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి

కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి దుగ్గుపోగు జాన్ బాబు పర్యవేక్షించారు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా మొదటి రోజు మంగళవారం కార్యక్రమం ఆసక్తికరంగా ప్రారంభమైనది.ఈ కార్యక్రమంలో  వేల్పుల ప్రభాకర్ మాస్టారు,ఎం. వేణుగోపాల్ మాస్టారు,ఎం.సురేష్ మాస్టారు పాల్గొని వేసవి శిక్షణ శిబిరం ను ప్రారంభించినారు. వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు వీటిని ప్రతి ఒక్క విద్యార్థిని,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరినారు.ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోనుకు దూరంగా ఉండి ఎండలో తిరగకుండా క్రమశిక్షణతో గ్రంథాలయంలో జరగబోవు కార్యక్రమంలో అన్నింటిలో పాల్గొని మంచి విజ్ఞానం సంపాదించుకోవాలని తెలిపినారు.పిల్లలతో క్యారమ్స్ ఆట ఆడించడం జరిగినది. తదుపరి కథలు చెప్పడం, కథలు చదివించడం జరిగినది.ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్, గ్రంథాలయ సిబ్బంది,పాఠకులు,విద్యార్థిని, విద్యార్థులు 15 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం  గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో జరిగినది.పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థిని,విద్యార్థులకు స్వీట్లు అందజేశారు.

About Author