NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దివ్యాంగుడికి..అజీస్ ఆర్థిక చేయూత

1 min read

కాలనీ ప్రజలకు నేనున్నాననే భరోసానిస్తూ ముందుకు..

నందికొట్కూరు న్యూస్ నేడు: పేద ప్రజలకే కాదు దివ్యాంగులకు కూడా ఏ కష్టమొచ్చినా నేనున్నాననే భరోసానిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు తెదేపా సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్ అజీస్..నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో రెండవ వార్డ్ లో ఉన్న ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే కాలనీ ప్రజలకు రెండవ వార్డ్ కాలనీ టీడీపీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీస్ ప్రజలకు అండగా ఉంటూ ముందుకెళ్తున్నారు. ఇదే వార్డులో షేక్ అతావుర్ రెహమాన్(55)దివ్యాంగుడు రెండు కాళ్లు పూర్తిగా సచ్చు ఉండడంతో ఇంటిలో నుండి బయటకి రాలేని పరిస్థితి. చాలా సంవత్సరాల నుండి వికలాంగుడిగా ఉన్నప్పటికీ కనీసం పింఛన్ రాలేని పరిస్థితి..ఈయన భార్య అనారోగ్యంతో గత పది ఏళ్ల క్రితం మరణించారు.వీరికి సంతానం లేదు.ఈయనకు తల్లి షెజురున్ భీ ఈమే వృద్ధాప్యంలో ఉన్నారు.

కుటుంబానికి ఆర్థిక చేయూత

వీరు ఉండడానికి కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి నెలకొంది.ఇంటిలో కుమారునికి అన్ని సపర్యలు తల్లి చేస్తున్నారు.తినడానికి తిండి లేదు.ఇంటి పక్కల వాళ్ళు మంచి మనసుతో స్పందిస్తూ వారు పెట్టే భోజనంతో కాలం గడుపుతూ ఉన్నారు.వీరి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న వార్డ్ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీస్ గురువారం దివ్యాంగుడి ఇంటికి వెళ్లి ఆర్థికంగా నగదు అందజేసి గొప్ప మనసును చాటుకున్నారు.తల్లి కుమారుడు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

About Author