ముగిసిన మొహరం పండుగ వేడుకలు..
1 min read
ఊరేగింపుగా వెళుతున్న లాల్ స్వామి పీర్ స్వాములు
చాగలమర్రి ,(న్యూస్ నేడు ): మండల కేంద్రమైన చాగలమర్రిలో చిన్నమకాణం లో వెలసిన లాల్ స్వామి మొహరం పండుగ వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. గ్రామ చాబిడి నుండి లాల్ స్వామి పీర్ లు హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లాల్ స్వామి చిన్నమ కానం గ్రామచావిడి నుండి గాంధీ సెంటర్ మీదుగా పెద్ద మకనం వరకు ఊరేగింపుగా వెళ్లడం జరిగింది. స్వామివారికి గంధం సమర్పించి పూలు నగదు కానుకలను సమర్పించుకున్నారు. గురువారం రాత్రి భక్తులకు లాల్ స్వామి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తజన సందోహంతో కిక్కిరిసిన వీధులలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు రూరల్ సీఐ బివి రమణ చాగలమర్రి ఎస్సై రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

