NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించండి

1 min read

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి

రేషన్ కార్డుల విభ‌జ‌న‌ను మరింత సులభతరం చేయండి    

అభ్యర్థి ఆధార్ నంబర్ తో సర్టిఫికెట్లన్నీ డీజీ వెరిఫై చేసేలా ఉండాలి

ఆర్టీజీఎస్ పై సమీక్షలో మంత్రి నారా లోకేష్

అమరావతి, న్యూస్​ నేడు: రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత‌గా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్జీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. శుక్రవారం స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ క‌మాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్టీజీఎస్‌పై మంత్రి స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ ల‌క్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగ‌తిపై ఆ శాఖ కార్యద‌ర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివ‌రించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ ప‌నుల‌న్నీ జులై నాటికి పూర్తికావాలని మంత్రి ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్ తో అనుసంధానించాలి. పాఠశాలల్లో  డ్రాప్ అవుట్ల‌ను డేటా లేక్ ద్వారా విశ్లేషించి, త‌గ్గించ‌డానికి గ‌ల‌ మార్గాలను అన్వేషించాలి. విద్యారంగంలో సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నాం. అన్ని శాఖల సమాచారం డేటా లేక్ ద్వారా అనుసంధానం కావాలని మంత్రి సూచించారు.

మనమిత్ర ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ కావాలి

ప్రజల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై మరింతగా అవగాహన కలిగేలా నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాల‌న్నారు. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్రజ‌ల‌కు క‌లిగే ఉప‌యోగం, వినియోగం, సుల‌భంగా ప్రభుత్వ సేవ‌లు ఎలా పొంద‌వచ్చో ప్రజ‌లకు వివరించాలన్నారు. రోజుల్లో  ఇచ్చే వేలాది పోస్టుల నోటిఫికేష‌న్లకు, ల‌క్షల సంఖ్యలో అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకుంటార‌ని, వీరంద‌రి స‌ర్టిఫికెట్లు పొందుప‌ర‌చ‌డంలో ఇబ్బందులు లేకుండా డీజీ వెరిఫైని స‌మర్థవంతంగా వినియోగించుకునేలా చ‌ర్యలు చేప‌ట్టాలని ఆదేశించారు.విభాగం ద్వారా రియ‌ల్ టైమ్‌లో ఎప్పటిక‌ప్పుడు తెలుసుకుని ఆ దిశ‌గా అధికారులు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాలి. రాయ‌లసీమ‌లో నీటి ఎద్దడి లేకుండా ప‌టిష్టమైన చ‌ర్యలు తీసుకోవాలి. యూరియా సరఫరాపైనా మంత్రి ఆరా తీశారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి జ‌య‌ల‌క్ష్మి, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖ‌ర్ జైన్‌,  సంయుక్త కార్యద‌ర్శి మాలిక గార్గ్‌, ఆర్టీఐహెచ్ సీఈవో ధాత్రి రెడ్డి, ఫైబ‌ర్‌నెట్ ఎండీ గీతాంజ‌లి శ‌ర్మ‌, సివిల్ స‌ప్లైస్ క‌మిష‌న‌ర్ క‌న్నబాబు, ఉన్న‌త విద్యాశాఖ క‌మిష‌న‌ర్ నారాయణ భ‌ర‌త్ గుప్త‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్టర్ త‌మీమ్ అన్సారియా, వ్య‌వ‌సాయ శాఖ డైరెక్టర్ మన్జీర్ జిలానీ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *