ప్యాపిలిలో మహిళల రక్షణే మా బాధ్యత పై అవగాహన
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: మహిళల రక్షణపై అవగాహన కల్పించేందుకు ప్యాపిలి పట్టణంలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం డోన్ పట్టణ ఇన్‌ఛార్జ్ సీఐ ఇంతియాజ్ భాష, ప్యాపిలి మండల తహసీల్దార్ భారతి, డోన్ రూరల్ ఎస్సై, శక్తి టీం ఇన్‌చార్జి మమత, ప్యాపిలి ఎస్సై నాగార్జున ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.శ్రీ వాసవి కళ్యాణ మండపం మహిళా కమిటీ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సంఘ సభ్యులు, గ్రామ మహిళలు కలిపి సుమారు 200 మంది సమిక్షించి సమావేశం నిర్వహించారు.మహిళల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిరోధం, ఫోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ నేరాలు వంటి విషయాలను వివరించారు. అదేవిధంగా ‘ క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్’ వంటి శక్తి యాప్‌ల వినియోగంపై కూడా సమాచారం అందించారు.మహిళలు ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, చట్టం వారి పక్షాన ఉందని పోలీసులు స్పష్టం చేశారు. కుటుంబాలు కూడా బాలికల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళలు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈకార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.


