NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షికారి కాలనీ అభివృద్ధికి 45 లక్షల నిధులు

1 min read

సారా నిర్మూలనపై కమిటీ ఏర్పాటు-మహిళల వద్ద నాటుసారా స్వాధీనం..

నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూరు పట్టణంలోని షికారి కాలనీ అభివృద్ధికి 45 లక్షల నిధులు మంజూరు అయినట్లు నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని షికారి కాలనీలో శనివారం ఉదయం నాటుసారా నిర్మూలనపై కాలనీ ప్రజలకు  నందికొట్కూరు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగాకాలనీలో నాటుసారా తయారు చేయకుండా ఏ విధంగా జీవితాలను అభివృద్ధి పరచుకోవాలనే వాటి గురించి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు ప్రజలకు వివరించారు.సారా రూపుమాపేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ మాట్లాడుతూ ఈ కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు.తహసిల్దార్ శ్రీనివాసులు,ఎస్సై చంద్రశేఖర్,మెప్మా అధికారి కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని అన్నారు.మీ కాలనీకి వెళ్లి ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ మమ్మల్ని ఆదేశించారని అన్నారు.ఎవరైనా కానిస్టేబుల్,ఎస్ఐ రాత పరీక్షలకు సిద్ధం అవుతుంటే వారికి కావలసిన మెటీరియల్ఇస్తామని ఎస్ఐ అన్నారు.పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి రుణాలు తోపుడు బండి,చిరు వ్యాపారాలు చేసుకునే పురుషులకు లోన్ల ద్వారా జీవితాలను అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తామని అన్నారు.ఎక్సైజ్  సూపరింటెండెంట్ మాట్లాడుతూ నిరక్షరాశులకు మరియు చదువుకున్న యువత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.షికారి కాలనీలో దాడులు చేయగా ఇద్దరు మహిళల వద్ద నుండి పది లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై జఫురుల్లా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *