NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

31 లక్షలతో సొసైటీకి ఎమ్మెల్యే భూమి పూజ..

1 min read

మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో పీరు సాహెబ్ పేట సహకార సొసైటీ కేంద్రానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య భూమి పూజ చేశారు.ఈ సొసైటీ కేంద్రం నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు సహకార సొసైటీ చైర్మన్ రెడ్డి వారి వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యేకు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు.నిర్మాణ పనులను ప్రత్యేక పూజలతో పనులను ప్రారంభించారు.తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఈ భవనం అంతేకాకుండా చిన్నపాటి వర్షానికి ఈ సొసైటీ ప్రాంగణంలో నీళ్లు నిల్వ ఉంటూ కార్యాలయం లోపలికి నీళ్లు వచ్చేవని నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సొసైటీ నూతన భవనానికి 31 లక్షలు మంజూరు అయ్యాయని అన్నారు.ఈ పనులు త్వరి తగతిన నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని  కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే

నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మండలాల కన్వీనర్లు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, ఖాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి,సొసైటీ సీఈఓ మల్లికార్జున,మర్రికుంట మహేశ్వర్ రెడ్డి,నాగేంద్రుడు, వెంకటేశ్వర రెడ్డి మరియు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *