శావ్ లీగ్స్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ లో మహిళ జట్టు ద్వితీయ స్థానం
1 min read
కర్నూలు జిల్లాను అభినందిస్తున్న శ్రీ టి.జి.వెంకటేష్
కర్నూలు, న్యూస్ నేడు: ఈ నెల 28 నుండి 30 తేది వరకు అనంతపురంలో జరిగిన శాప్ లీగ్స్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ నందు కర్నూలు జిల్లా పుట్బాల్ అండర్- 21 మహిళ జట్టు ద్వితీయ స్థానం సాధించింది.అలాగే శ్రీ టి.జి.వెంకటేష్, ఎక్స- యం.పి., మాట్లాడుతు మహిళలు క్రీడలల్లో పాల్గోని విజయాలు సాధించి కర్నూలు అండర్ – 21 మహిళ జట్టు ద్వితీయ స్థానం అందించడం విశేషం అని తేలియజేయడమైనది.అలాగే శ్రీ బి.భూపతి రావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, కర్నూలు మాట్లాడుతు అండర్ – 21 మహిళ జట్టు రాష్ట్ర స్థాయిలో పాల్గోని కర్నూలు జిల్లాకు ద్వితీయ స్థానం సాధించడం గర్వకారణం అని వివరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ ముప్పా రాజశేఖర్ , జిల్లా సంఘం అధ్యక్ష కార్యదాక్షులు, శ్రీ శ్రీనివాసులు, శ్రీ జగదీష్ రావు , శ్రీ పాల్ విజయకుమార్ , శ్రీ బ్రహ్మ , శ్రీ విజయ్ , అంజలి మరియు శ్రీ డి. వేణుగోపాల్ సంతోష్ ట్రోఫి క్రీడా కారుడు పాల్గోన్నారు.

