NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళితులు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా జన్మ హక్కు

1 min read

మతం మారితే కులవివక్షత పోదు సామాజిక హోదా పెరగదు

ఎస్సీ హోదా కొనసాగడానికి జాతీయ స్థాయిలో ఉద్యమం

ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ

పశ్చిమగోదావరి జిల్లాప్రతినిధి, న్యూస్ నేడు: షెడ్యూల్ కులాలు వారు ఏదైనా మతం మారినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు సామాజిక హోదా ఎక్కడ మారదని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. భీమవరం కుముదవల్లి రోడ్డు లోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రాజ్యాంగం ఎస్సీలకు కల్పించిన సామాజిక స్థితి అవగాహన సదస్సు లో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ కులాల వారు క్రైస్తవమో మరొక మతమో తీసుకున్నంత మాత్రాన వారి యొక్క సామాజిక హోదా సామాజిక గౌరవం ఎక్కడా పెరగదు అన్నారు. ఎస్సీలు మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు పొందలేరని ఎస్సీ హోదా ఉండదని సుప్రీంకోర్టు చెప్పడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు. కులం, కుల వివక్షత ఉన్నంతకాలం ఎస్సీలు ఎస్టీలు ఇతరులకు రిజర్వేషన్లు అమలు చేయవలసిందే అన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ద్వారా ఏదైనా మతాన్ని దైవాన్ని పూజించుకునే హక్కు ప్రచారం చేసుకునే హక్కు కల్పించిందన్నారు. కుల వ్యవస్థ ఉన్నంతకాలం సామాజిక గుర్తింపులో అంతరాలు ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉంటుందన్నారు. దళితులకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగడానికి కల్పించడానికి తాను జాతీయస్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. చెందిన వారందరూ నీ ఒకే వేదిక మీదకు తీసుకు వస్తున్నానన్నారు.30 సంవత్సరాల కాలంగా ఎమ్మార్పీఎస్ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే ఎస్సి ఉప కులాల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. దళితులు ఇబ్బంది పెడితే ఏ స్థాయిలో ఉన్న వారిని అయినా ఎవరినైనా ఉమ్మడిగా ఎదుర్కొంటాంఆకివీడులో ఉద్రిక్తతలకు సంబంధించి రఘురామకృష్ణ రాజు పై దళితుల ఆత్మగౌరవంను దెబ్బతీసి ఇబ్బందుల్లో పెట్టి వేధించే వారిపై వారు ఏ స్థాయిలో ఉన్న ఎవరైనా వారిని ఉమ్మడిగా ఎదుర్కొంటామని పోరాటం చేస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు వ్యాఖ్యలు దళితులు ,దళిత క్రైస్తవులను, క్రైస్తవులను అవమానించే విధంగా అవహేళన చేసే విధంగా ఉన్నాయన్నారు రఘురాం కృష్ణంరాజు చేష్టలు మాటలు తెలుగు నేల లోనే కాకుండా దేశం చుట్టూ తిరుగుతూ చర్చనీయం అవుతున్నాయన్నారు. రఘురాం కృష్ణంరాజు వ్యవహార శైలిపై ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్తాను అన్నారు. రఘురాం కృష్ణంరాజు చేస్తున్న పనులు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు దళిత సమాజం ను దూరం చేస్తున్నాయన్నారు. చేస్తాయన్నారు కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయన్నారు. రఘురాం కృష్ణంరాజు అంశంలో చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం చర్యలు తీసుకుంటారో ఎదురు చూడాలన్నారు.

About Author