NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవ్వు ఆయుష్షును పెంచుతుంది…!

1 min read

చైతన్య పరిచే హాస్యం…. సమాజానికి అవసరం…

  • మనసారా నవ్వితే.. హార్ట్​ బీట్​, బీపీ కంట్రోల్​..
  • మెదడును ఉత్తేజ పరిచి… హాస్య గ్రంథులు విడుదల..
  • ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్​ జె. రమేష్​
  • స్నేహం..బంధుత్వం.. పెంచుకోవాలి
  • డా. ఎన్టీ ఆర్​ ఆరోగ్య శ్రీ వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​

కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు : సమాజాన్ని చైతన్య పరిచే…. మేల్కొలుపే హాస్యం యువతకు ఎంతో అవసరమన్నారు ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్​ జె. రమేష్​. మనిషి జీవిత కాలాన్ని పెంచే ఏకైక అమృతవాణి హాస్యం ఒక్కటేనని స్పష్టం చేశారు.  ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు.  ఈ ఏడాది థీమ్ “నవ్వుల ద్వారా ప్రపంచ శాంతి” (World Peace through Laughter).  కర్నూలు నగరంలోని  కర్నూలు హార్ట్ ఫౌండేషన్​  చాంబరులో డా. ఎన్టీఆర్​ వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ నేతృత్వంలో ‘ హాస్య వల్లరి ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్​ జె. రమేష్​ మాట్లాడారు. నవ్వును ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని,  సంబంధాలను బలోపేతం చేసి… సానుకూలతను వ్యాప్తి చేసే ఏకైక మార్గం హాస్యం అన్నారు.  ప్రస్తుత యువత జీవితంపై అవగాహన లేక … చిన్నపాటి అంశాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,  కొందరు  ఉద్యోగ రీత్యా ఒత్తిడికి గురవుతూ మానసికంగా కుంగిపోతూ జీవితం గడిపేస్తున్నారని, అలాంటి వారందరూ  సోషల్​ మీడియాను నవ్వుల వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. విజ్ఞానం పెంచుకునేందుకు సోషల్​ మీడియాను వాడాలని, దుర్వినియోగం చేస్తే భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. 

హాస్యంతో…ఆరోగ్యం : డా.ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​

మానసిక ఒత్తిడిని తగ్గించి… జీవిత కాల ఆయుష్షును పెంచే ఏకైక మార్గం హాస్యం ఒక్కటేనని.. అందుకే ప్రతి ఒక్కరూ నవ్వుతూ జీవించాలని సూచించారు డా.ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ .  మనిషి ఆరోగ్యానికి ..హాస్యాన్ని మించిన మందు మరొకటి ఉండదన్నారు. ప్రతి రోజు నవ్వుతూ ఉండే మనిషిలో హార్ట్​ బీట్​ , బీపీ కంట్రోల్​ లో ఉంటుందని, మెదడు ఉత్తేజి పరిచి హాస్య గ్రంథులు విడుదలవుతాయని, దీన్ని వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహంతో రోజును గడుపుతారన్నారు.  

హార్ట్​ ఫౌండేషన్​లో.. హాస్యం..

2002లో ప్రారంభమైన కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ లో  2012 నుంచి ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం  నిర్వహిస్తూనే ఉన్నాం. ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్​ జె. రమేష్​  పలుమార్లు ఫౌండేషన్​ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి .. కర్నూలు ప్రజలకు ఆనందాన్ని పంచారు.  వివిధ వ్యాధులు, చికిత్సలు, జాగ్రత్తలతోపాటు ఆరోగ్య సూత్రాలను కూడా ఎంతో మంది ప్రముఖ వైద్యులు వచ్చి ప్రజలకు, మెడికల్​ విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారని ఈ సందర్భంగా డా. చంద్ర శేఖర్​ వెల్లడించారు.

మిమిక్రీ ఆర్టిస్ట్​ రమేష్​ కు ఘన సన్మానం

కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ లో హాస్యం పండించిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్​ రమేష్​ ను ఫౌండేషన్​ గౌరవాధ్యక్షుడు చంద్ర శేఖర్​ కల్కూర, ప్రధాన కార్యదర్శి, డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్​ ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి.. పూలమాలతో సత్కరించారు. హైదరాబాద్​ నుంచి వచ్చి కర్నూలు ప్రజలకు  తన హాస్యంతో ఆనందాన్ని పంచిన జె. రమేష్​ ను ఎందరో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

డా.చంద్ర శేఖర్​ కు సత్కారం

డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​… వృత్తి రీత్యా అత్యున్నత పదవిలో ఉన్నా .. కర్నూలు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారని హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు ప్రశంసించారు. ఎంత ఎదిగినా… ఒదిగి ఉండాలన్న.. సామెత డా. చంద్ర శేఖర్​ జీవన శైలిలో కనిపిస్తుందన్నారు.  ఈ సందర్భంగా ఫౌండేషన్​ సభ్యులు డా. చంద్ర శేఖర్​ ను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *