నవ్వు ఆయుష్షును పెంచుతుంది…!
1 min read
చైతన్య పరిచే హాస్యం…. సమాజానికి అవసరం…
- మనసారా నవ్వితే.. హార్ట్ బీట్, బీపీ కంట్రోల్..
- మెదడును ఉత్తేజ పరిచి… హాస్య గ్రంథులు విడుదల..
- ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్ జె. రమేష్
- స్నేహం..బంధుత్వం.. పెంచుకోవాలి
- డా. ఎన్టీ ఆర్ ఆరోగ్య శ్రీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు : సమాజాన్ని చైతన్య పరిచే…. మేల్కొలుపే హాస్యం యువతకు ఎంతో అవసరమన్నారు ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్ జె. రమేష్. మనిషి జీవిత కాలాన్ని పెంచే ఏకైక అమృతవాణి హాస్యం ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ “నవ్వుల ద్వారా ప్రపంచ శాంతి” (World Peace through Laughter). కర్నూలు నగరంలోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ చాంబరులో డా. ఎన్టీఆర్ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ నేతృత్వంలో ‘ హాస్య వల్లరి ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్ జె. రమేష్ మాట్లాడారు. నవ్వును ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని, సంబంధాలను బలోపేతం చేసి… సానుకూలతను వ్యాప్తి చేసే ఏకైక మార్గం హాస్యం అన్నారు. ప్రస్తుత యువత జీవితంపై అవగాహన లేక … చిన్నపాటి అంశాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొందరు ఉద్యోగ రీత్యా ఒత్తిడికి గురవుతూ మానసికంగా కుంగిపోతూ జీవితం గడిపేస్తున్నారని, అలాంటి వారందరూ సోషల్ మీడియాను నవ్వుల వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. విజ్ఞానం పెంచుకునేందుకు సోషల్ మీడియాను వాడాలని, దుర్వినియోగం చేస్తే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుందన్నారు.
హాస్యంతో…ఆరోగ్యం : డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్
మానసిక ఒత్తిడిని తగ్గించి… జీవిత కాల ఆయుష్షును పెంచే ఏకైక మార్గం హాస్యం ఒక్కటేనని.. అందుకే ప్రతి ఒక్కరూ నవ్వుతూ జీవించాలని సూచించారు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ . మనిషి ఆరోగ్యానికి ..హాస్యాన్ని మించిన మందు మరొకటి ఉండదన్నారు. ప్రతి రోజు నవ్వుతూ ఉండే మనిషిలో హార్ట్ బీట్ , బీపీ కంట్రోల్ లో ఉంటుందని, మెదడు ఉత్తేజి పరిచి హాస్య గ్రంథులు విడుదలవుతాయని, దీన్ని వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహంతో రోజును గడుపుతారన్నారు.
హార్ట్ ఫౌండేషన్లో.. హాస్యం..
2002లో ప్రారంభమైన కర్నూలు హార్ట్ ఫౌండేషన్ లో 2012 నుంచి ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే ఉన్నాం. ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్ జె. రమేష్ పలుమార్లు ఫౌండేషన్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి .. కర్నూలు ప్రజలకు ఆనందాన్ని పంచారు. వివిధ వ్యాధులు, చికిత్సలు, జాగ్రత్తలతోపాటు ఆరోగ్య సూత్రాలను కూడా ఎంతో మంది ప్రముఖ వైద్యులు వచ్చి ప్రజలకు, మెడికల్ విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారని ఈ సందర్భంగా డా. చంద్ర శేఖర్ వెల్లడించారు.
మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ కు ఘన సన్మానం
కర్నూలు హార్ట్ ఫౌండేషన్ లో హాస్యం పండించిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ ను ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు చంద్ర శేఖర్ కల్కూర, ప్రధాన కార్యదర్శి, డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్ ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి.. పూలమాలతో సత్కరించారు. హైదరాబాద్ నుంచి వచ్చి కర్నూలు ప్రజలకు తన హాస్యంతో ఆనందాన్ని పంచిన జె. రమేష్ ను ఎందరో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
డా.చంద్ర శేఖర్ కు సత్కారం
డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్… వృత్తి రీత్యా అత్యున్నత పదవిలో ఉన్నా .. కర్నూలు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారని హార్ట్ ఫౌండేషన్ సభ్యులు ప్రశంసించారు. ఎంత ఎదిగినా… ఒదిగి ఉండాలన్న.. సామెత డా. చంద్ర శేఖర్ జీవన శైలిలో కనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు డా. చంద్ర శేఖర్ ను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు.



