NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గంగమ్మ అవ్వ గోపురానికి పెయింటింగ్ కోసం ఎమ్మెల్యే విరాళం

1 min read

హోళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం పెద్ద గోనెహల్ గ్రామంలో గంగమ్మ అవ్వ గోపురానికి పెయింటింగ్ పనులు చేపట్టేందుకు ఆర్థిక సహాయం అందించబడింది. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే  బుసినే విరుపాక్షి  తన వంతు సహాయంగా రూ. 20,000 విరాళం అందజేశారు.గ్రామంలోని గంగమ్మ అవ్వ గోపురాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించబడినట్లు ఎమ్మెల్యే  తెలిపారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు బీవీఆర్  అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author