NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రామాయణంలేకపోతే ప్రపంచానికి ఆదర్శం లేదు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీమద్రామాయణం లేకపోతే ప్రపంచానికి ఒక ఆదర్శమేలేదని, అటువంటి రామాయణ పఠన, పారాయణ, అద్యయనం సర్వమానవాలికి ఎంతో అవసరమని  ప్రముఖ ప్రవచనకర్త మధురవాచస్పతి శ్రీనివాస రామానుజ దాసు అన్నారు. కర్నూలు నగరంలోని శ్రీ భరతమాత దేవాలయంనందు సుందరకాండ ప్రవచన సప్తాహంలో భాగంగా రెండవరోజు హనుమంతుని సేవాగుణం, ప్రతికూల పరిస్థితులకు తట్టుకుని పోరాడడం మొదలైన ఘట్టాలను వివరించారు. ప్రవచనకర్తను ముందుగా శేషవస్త్రము, పూలమాలతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో అఖిల భారత విష్ణుసహస్రనామ సాంస్కృతిక సమాఖ్య ఉపాధ్యక్షులు మల్లెల పెద్ద పుల్లారెడ్డి, భరతమాత సేవా సమితి అధ్యక్షులు సందడి మహేశ్వర్, వి. సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కె. వి. సుబ్బారెడ్డి, కార్యదర్శి అయోధ్య శ్రీనివాసరెడ్డి, సహకార్యదర్శి  తూముకుంట ప్రతాపరెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.శివశంకర్ రెడ్డి, చంద్రారెడ్డి, నారాయణరెడ్డి, లావణ్య, అర్చకులు భరద్వాజ్ శర్మ, , శకుంతల, పద్మావతి, కాత్యాయనీ, శ్రీలక్ష్మి, వసుంధరమ్మ, ప్రమీల, రత్నమ్మ తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author