NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మంచి-చెడు’లపై తల్లిదండ్రులకు తెలియాలి

1 min read

మహిళలకు అవగాహన కల్పించిన డీఎస్పీ రామాంజి నాయక్..

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: మంచి పనులు ఏవి.?చెడు పనులు ఏవి.? అనేవి ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలని అప్పుడే పిల్లలకు మంచి..చెడు పనుల గురించి నేర్పిస్తారని ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కార్యక్రమానికి డీఎస్పీ మరియు రూరల్ సీఐ టి. సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ బాలికలకు మహిళలకు ఏమైనా సంఘటన జరిగితే వెంటనే మీకు సపోర్టుగా’శక్తి టీం’ అనేది ఉంది అంతేకాకుండా మీకు ఏమి ఇబ్బంది జరిగినా సరే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే అక్కడికి వస్తారని అంతేకాకుండా నేడు పిల్లలందరికీ మొబైల్ ఫోన్లు ఇవ్వడం వల్లే పిల్లలు చెడు అలవాట్లకు గురౌతున్నారని అన్నారు.మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి ధైర్యం,భరోసా ఇచ్చేందుకే మహిళలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ అన్నారు.పిల్లల్ని చదివిస్తే జ్ఞానం వస్తుంది ఎక్కడైనా సరే మహిళలకు అనుకోని సంఘటనలు జరిగితే స్టేషన్ కు రాలేని వారు 112 కు ఫోన్ చేయవచ్చని సీఐ సుబ్రహ్మణ్యం అన్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆటో స్టాండ్ సర్కిల్లో మనవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,ఖాతా రమేష్ రెడ్డి,డాక్టర్ వ్యోమకేష్, అంగన్వాడీ సూపర్వైజర్ రేణుక దేవి,ఏపీఎం సుబ్బయ్య మరియు మహిళలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *