వేర్వేరు రక్తగ్రూప్‌ల మధ్య అరుదైన కిడ్నీ మార్పిడి విజయవంతం
1 min read
– మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు
కర్నూలు, న్యూస్ నేడు: మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు లో వైద్య రంగంలో అరుదైన ఘనత సాధిస్తూ వేర్వేరు రక్తగ్రూప్‌లున్న దాత–గ్రహీత మధ్య కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇది రాయలసీమ ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించిన ప్రత్యేక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌గా గుర్తింపు పొందింది. అలాగే ఇది మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలులో నిర్వహించిన 8వ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స.ఆత్మకూరు ప్రాంతానికి చెందిన రోగి గత 3 సంవత్సరాలుగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతూ, గత 1.5 సంవత్సరాలుగా డయాలిసిస్ చికిత్స పొందుతున్నాడు. శాశ్వత పరిష్కారం కోసం కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించి మెడికవర్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ బృందాన్ని సంప్రదించారు.ఈ సందర్భంగా రోగి తండ్రి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే దాత మరియు గ్రహీత రక్తగ్రూప్‌లు వేర్వేరుగా ఉండటంతో, సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మార్పిడి విఫలమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మెడికవర్ నెఫ్రాలజీ బృందం ఆధునిక వైద్య విధానాలు, ఇమ్యూనోసప్రెషన్ (Immunosuppression) చికిత్సలు వినియోగించి శస్త్రచికిత్స విజయవంతం కావడానికి మార్గం సుగమం చేసింది.ఈ క్లిష్ట కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను యూరాలజిస్ట్ డా. ఎస్. అబ్దుల్ సమద్ మరియు నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ నైపుణ్యంతో విజయవంతంగా నిర్వహించారు. అనస్తీషియా బృందం Dr Vijay Sai & Dr Reshma మరియు ఓటీ సిబ్బంది కూడా సమర్థవంతంగా సహకరించారు.శస్త్రచికిత్స అనంతరం కేవలం 2 రోజుల్లోనే రోగి క్రియాటినిన్ స్థాయిలు 1.2కి తగ్గి, డిశ్చార్జ్ సమయంలో 0.9 స్థాయికి చేరడం వైద్యపరంగా అత్యంత సానుకూల ఫలితంగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉండి కోలుకుంటున్నాడు. మొత్తం శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకం కింద విజయవంతంగా నిర్వహించబడింది, దీని ద్వారా రోగికి ఆర్థిక భారం లేకుండా అత్యాధునిక చికిత్స అందించబడింది.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ Maheswar Reddy గారు మాట్లాడుతూ,“వేర్వేరు రక్తగ్రూప్‌ల మధ్య కిడ్నీ మార్పిడి చేయడం వైద్యపరంగా అత్యంత క్లిష్టమైనది. అయినప్పటికీ మా నిపుణులైన వైద్య బృందం ఆధునిక చికిత్స విధానాలతో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇలాంటి అత్యున్నత స్థాయి అవయవ మార్పిడి సేవలు అందించడం మా గర్వకారణం” అని తెలిపారు.

