NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహోన్నతుడు కార్ల్ మార్క్స్….

1 min read

కార్ల్ మార్క్స్ ఆశయాలు కోసం మనమంతా కృషి చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్

చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కార్ల మార్క్స్ 207వ జయంతి కార్యక్రమం ఆర్.ఆర్.పేట,స్ఫూర్తి భవన్ నందు ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ అధ్యక్షతన జరిగిoది. సాధిస్తాం కార్ల్ మార్క్స్ ఆశయాలను జోహార్ కార్ల్ మార్క్స్, వర్ధిల్లాలి మార్క్సిజం,లెనినిజం అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ కార్ల్ మార్క్స్  చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ 1818 సంవత్సరంలో మే 5వ తేదీన జన్మించిన కార్ల్ మార్క్స్  ఆధునిక ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తిగా ఖ్యాతి పొందాలని కొనియాడారు.సమాజాన్ని నిరంతరం పరిశీలించిన కార్ల్ మార్క్స్  మనిషిని మనిషి దోపిడీ చేయకుండా సమ సమాజం నిర్మాణం చేయాలని అందుకు అవసరమైన సిద్ధాంతాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శప్రాయుడుగా నిలిచారని కొనియాడారు. తన జీవితంలో అనేక కష్టాలను, ఇబ్బందులను చూసిన కార్ల్ మార్క్స్  సమాజం అభివృద్ధి కోసమే నిరంతరం పరితపించారని తెలిపారు.ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన రచనల ద్వారా సమాజ మార్పు కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ నిరంతరం సమాజ మార్పు కోసం ఆలోచన చేసేవారని ప్రపంచంలోని మనుషులు సమానంగా జీవించాలని కోరుకున్న గొప్ప వ్యక్తి కార్ల్ మార్క్స్  అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ భవిష్యత్తు ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు గొర్లి స్వాతి,కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు,తమ్మిశెట్టి రమణయ్య ,దాచేపల్లి ఆదినారాయణ,మరడాని సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *