NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పది ఫలితాల్లో డా. బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థుల ప్రభంజనం

1 min read

ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: (పెదపాడు మండలం) పదవ తరగతి ఫలితాలలో పి.ఎమ్. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం జూనియర్ కళాశాల,వట్లూరు విద్యార్థులు విజయభేరి మోగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలలోని గురుకుల పాఠశాలలలో ప్రథమ స్థానం సాధించిందని చెప్పడానికి గర్విస్తున్నాము. అలాగే పెదపాడు మండలంలో ప్రథమ స్థానం సాధించిందని చెప్పడానికి గర్విస్తున్నాంఅన్నారు. 10వ తరగతి ఫలితాలలో 89 మంది విద్యార్థులకు 87 మంది పాసయ్యారు.ఉత్తీర్ణతా శాతం 98%. జె.ఎమిలీ 600 మార్కులకు 572 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. యు.భవ్యశ్రీ 555 మార్కులతో ద్వితీయ స్థానం, టి.అమూల్య 549 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. 10 మంది విద్యార్థుల 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. తెలుగు సబ్జెక్ట్ 100 శాతం, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 100 శాతం, హిందీ సబ్జెక్ట్లలో 100 శాతం, సోషల్ సబ్జెక్ట్ లో 100 శాతం మ్యాథ్స్ సబ్జెక్ట్ 100 శాతం సైన్స్ సబ్జెక్ట్ 98 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి అభినందించారు.

About Author