NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు  జీజీహెచ్​ ఓ.టి విభాగాల్లో సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు  నేడు ఆసుపత్రిలోని వివిధ ఆపరేషన్ థియేటర్లను ఓ.టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శస్త్రచికిత్సల నిర్వహణ, అక్కడ ఉన్న సౌకర్యాలు మరియు రోగుల భద్రతా ప్రమాణాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.అక్కడ ఉన్న రోగులను పలకరించి అందుతున్న మెరుగైన వైద్య సేవల గురించి ఆరా తీసారు.ఆపరేషన్ థియేటర్లలో ఉన్న వైద్య పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేశారు. అత్యాధునిక యంత్ర పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఓ.టి లలో ఇన్ఫెక్షన్లు సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. శానిటేషన్ మరియు స్టెరిలైజేషన్ ప్రక్రియలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు CSRMO DR P. పద్మజ  డిప్యూటీ CSRMO DR V. పద్మజ  RMO DR వెంకట రమణ , ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారులు, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రి భాయ్  మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Author