NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ బడి పిలుస్తుంది’… పిల్లల చేరికలకు ఊతం..

1 min read

జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్

కర్నూలు ఎడ్యుకేషన్, న్యూస్ నేడు : కర్నూలు నగరం సీ క్యాంప్ పరిధిలోని ప్రైమరీ పాఠశాల పరిధిలో గల శ్రీరామ్ నగర్ మరియు రైతు బజార్ ప్రాంతాల్లో బడి పిలుస్తుంది కార్యక్రమం భాగంగా బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, అర్హత కలిగిన చిన్నారులను ఒకటవ తరగతిలో చేర్పించారు.  ఈ సందర్భంగా  జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్  మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో చేరాలని, ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి బాలబాలిక ప్రభుత్వ పాఠశాలలో చేరాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా మాట్లాడి, పిల్లల చేరికలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు  చౌడయ్య ,  రెహమాన్, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ రఫీ, ఐసీడీఎస్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author