NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘శక్తి టీం’పై అవగాహన కల్పించిన సీఐ సుబ్రహ్మణ్యం

1 min read

మహిళా చట్టాలపై మహిళలకు అవగాహన..

నందికొట్కూరు న్యూస్ నేడు:’శక్తి టీం’యాప్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అంతేకాకుండా వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే వాటి గురించి నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం మహిళలకు అవగాహన కల్పించారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో శుక్రవారం వైయస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి సీఐతో పాటు డిప్యూటీ తహసీల్దార్ నాగన్న,ఇన్చార్జి ఏరియా కోఆర్డినేటర్ ఏపీఎం అంబమ్మ,ఎంపీపీ నీలమ్మ,జిల్లా మహిళ కో ఆడినేటర్ షాజహాన్,సిపిఐ పార్టీ రమేష్ మరియు మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శక్తి యాప్ గురించి శక్తి యాప్ నంబర్ 7993485111 ను మహిళలు వినియోగించుకోవాలని బాల్యవివాహాలు,చిన్న పిల్లలపై నేరాలు జరిగితే 1098 ఫిర్యాదు చేయవచ్చ ని,అలాగే ప్రస్తుత సమాజంలో మహిళకోసం ఏర్పాటు చేసిన చట్టాల గురించి,చట్టాల వల్ల మహిళలకు జరిగే ప్రయోజనాల గురించి వివరించారు.చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వలన వారికీ కలిగే ఆరోగ్య సమస్యలను తెలుపుతూ ఏదన్నా ఎమర్జెన్సీ సమయం లో 112,100 కి ఫోన్ చేయాలని,సైబర్ క్రైమ్ జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని ఐవిఆర్ఎస్ ఫోన్లు కానీ ఏదన్నా లింక్స్ లాంటివి  వాట్స్ అప్ లో పంపితే వాటిని ఓపెన్ చేయొద్దని తెలుపుతూ వాటి ద్వారా జెరిగే ఆర్థిక మోసాల గురించి వివరించారు.మహిళలకు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ అన్నారు. ఇన్చార్జి ఏసి అంబమ్మ మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు అన్నింటిలోనూ ముందంజలో ఉన్నారని వారిని మంచిగా చదివించాలని అన్నారు.

About Author