NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీజీహెచ్​లో ఏ.యం.సి ఎమర్జెన్సీ విభాగాలను సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు  ఈరోజు సాయంత్రం ఆసుపత్రిలోని ఏ.ఎం.సి మరియు ఎమర్జెన్సీ విభాగాలను సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.విధుల్లో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోగుల ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.వార్డుల్లోని పరికరాల పనితీరును ఆయన తనిఖీ చేశారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ అధికారులు డాక్టర్ శివ బాల, డాక్టర్ యం.వి కిరణ్ కుమార్ మరియు  ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *