ప్రగతి అంటే ఎలా ఉండాలని చేసి చూపించిన ఏలూరు ఎంపీ
1 min read
23 నెలల్లో అనునిత్యం అభివృద్ధిపై ఆలోచన ప్రజలతో మమేకం
ఏలూరు ప్రజల చిరకాల వాంఛ వందే భారత్ రైలు హల్ట్ ఏర్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో
కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వే నివేదికలో రాష్ట్రంలో ఉన్న 21 మంది కూటమి ఎంపీలలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి మూడో స్థానం లభించడం చాలా ఆనందం గర్వించదగ్గవిషయం ఇ కపోతేఎంపీగా గత 23 నెలల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టిన పనులు, సాధించిన ప్రగతి ఒక్కసారి గమనిస్తే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ చేసిన కృషి సాధించిన ప్రగతి స్పష్టంగా కనబడుతుంది.ఏలూరుకు వందే భారత్ రైలు హల్ట్ ఏర్పాటు చేశారు. ఇది ఏలూరు పార్ల మెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అదృష్టం గానే భావించవచ్చు 22 కోట్లతో ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.దాదాపు 1100 కోట్లతో 13 రైల్వే గేట్ల వద్ద ఆర్ ఓ బి ల నిర్మాణం. అనుమతులు వచ్చాయి, భూ సమస్యలు పరిష్కరించి పనులు మొదలుపెట్టాలి.కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల చిరకాల కోరిక కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైన్ ఎంపీ నిరంతర సంప్రదింపులు, ఒత్తిడితో రైల్వే అధికారులు డీపీఆర్డి రెడీ చేసి పంపారు. త్వరలో అనుమతులు వచ్చి, పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్- విశాఖ మధ్య దాదాపు 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది, నాలుగు ఎస్సి అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు ఎస్టి అసెంబ్లీ నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ వెళ్లే అత్యంత ముఖ్యమైన భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్ పనులను త్వరగా చేపట్టాల్సిందిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇటీవల కోరారు. ఈ రైల్వే లైన్ కోసం అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్ధిక వనరులు తక్కువగా ఉన్న కారణంగా 100 శాతం రైల్వే నిధులతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని గతంలోనే కోరిన విషయాన్ని కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గుర్తుచేశారు. (డీపీఆర్ డి డిజైన్ ఫోటో ఉంది, అది చూపించాలి. కొవ్వూరు, భద్రాచలం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల బోర్డుల ఫోటోలు పెట్టాలి. తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు వేలేరుపాడు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల పొడవు రోడ్డు రూ.34.50 కోట్లు విడుదల చేయించి రోడ్డు పనులు పూర్తి చేయించారు. టి నర్సాపురం మండలం వీరభద్రవరం,వెలగపాడు, ఉంగుటూరు, కైకలూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో MGNREGS కింద సిమెంట్ రోడ్లు.కోటి రూపాయలతో ఏలూరు శాంతి నగర్-జేవీఆర్ స్కూల్ మెయిన్ రోడ్డు నిర్మాణం.సీలింగ్ తొలగించి, రైతుల వద్ద ఉన్న అదనపు పొగాకును కూడా విక్రయించడానికి అనుమతి, రైతులకు 120 కోట్లకు పైగా లబ్ది. ధర కూడా కేజీ రూ.
450 వరకూ లభించడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు.
ఆయిల్ పామ్ రైతులకి గిట్టుబాటు ధర వస్తోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,500 కోట్లు మంజూరు కావడంలో కీలక పాత్ర.
పోలవరం ముంపు గ్రామాల నుంచి పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు కొత్త కాలనీల్లో ఉపాధిహామీ పథకం పనుల్లోకి వెళ్లడానికి జాబ్ కార్డులు ఇప్పించారు. నిరంతరం ప్రజల మనిషిగా సామాన్యులకు అందుబాటులో ఉన్న ఎంపీగా ఆయనకు గుర్తింపు ఉంది.ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 600 మందికి పైగా లబ్దిదారులకు రూ 5.5 కోట్ల పైచిలుకు ఆర్థిక సహాయం (సి యంఆర్ ఫ్ )చెక్కుల పంపిణీతో 2024 సెప్టెంబర్ నెలలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా (విజయవాడ) నిరాశ్రయులైన బాధితులకు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల చెక్కు అందజేశారు.
ఎంపీ నిధులతో పోలీస్ విశ్రాంతి బ్యారక్ నిర్మాణం.
ఏలూరు పట్టణం 32వ డివిజన్ పరిధిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.64.08 లక్షలు ఎంపీ నిధులతో చేపడుతున్న పోలీస్ విశ్రాంతి మహిళ,పురుషుల బ్యారక్ కునిధులు మంజూరు చేశారు.ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గెయిల్ ఇండియా ద్వారా 1కోటి రూపాయల విలువైన వైద్య పరికరాలు ఏర్పాటుచేశారు..ప్రగతి అంటే ఎలా ఉండాలని చేసి చూపించిన మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కి మరోమారు ధన్యవాదాలు తెలిపారు.

