NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగికి విశ్రాంతి..

1 min read

సూపర్వైజర్ సుశీల

చాగలమర్రి రూరల్ న్యూస్​   ( నేడు ):  సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఒక్క ఉద్యోగికి  రిటైర్మెంట్ విశ్రాంతి అని  చాగలమర్రి మండలం ఐసిడిఎస్ సూపర్వైజర్  సుశీల అన్నారు. శుక్రవారం చింతలచెరువు గ్రామానికి చెందిన  అంగన్వాడి టీచర్  జయలలితమ్మ, ముత్యాలపాడు మూడవ సెంటర్ అంగన్వాడి సహాయకురాలు  వెంకటసుబ్బమ్మ  ల రిటైర్మెంట్ కార్యక్రమానికి సూపర్వైజర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె  ఉద్యోగ విరమణ పొందిన వారిని సన్మానించారు. సమగ్ర శిశు అభివృద్ధి  సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ గా  నియమించబడి మాత శిశు సంరక్షణకు గ్రామంలో విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా  పని భారం ఎక్కువ, వేతనం తక్కువ అయినప్పటికీ కుటుంబాన్ని పోషించుకుంటూ  ప్రజాసేవ  చేయడం జరిగిందన్నారు. ఎందరో విద్యావంతులు ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే ఉద్యోగాలు రావడం అదృష్టంగా భావించాలన్నారు. ఉద్యోగం ఒక వరంగా భావించారని సూచించారు. అధికారులకు, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ విధులు నిర్వహించడం ఎన్నో సవాళ్లను ఎదురుకోవడమేనని ఆమె తెలిపారు. అంగన్వాడి టీచర్ జయలలిత మాట్లాడుతూ ఉద్యోగంలో చేరినప్పుడు మ్యాన్యువల్ రూపంలో  రికార్డులు నిర్వహించే వారమని  ప్రస్తుతము  సాంకేతిక పరిజ్ఞానం  ఉన్న కాలంలో  ప్రతి రికార్డులను టెక్నికల్ గా  నమోదు చేయాల్సి ఉందని, వీటిలో సూపర్వైజర్,సహపాటి అంగన్వాడి టీచర్లు  ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author