ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరీక్షలలో టాపర్ గా నిలిచిన ఆదిత్య విద్యార్థిని
1 min read
అభినందించిన ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు,వైస్ ప్రిన్సిపాల్ డి.వి.వి.ఫణికుమార్,అధ్యాపక, ఆధ్యాపకేతర బృందం
9.80 గ్రేడ్ పాయింట్లుతో ఏలూరు టౌన్ డిగ్రీ కళాశాలలో టాపర్ గా మధుశ్రీవల్లి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆదిత్య డిగ్రీ కళాశాల, సత్రంపాడు, ఏలూరులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నల్లగొండ మధుశ్రీవల్లి నన్నయ్య యూనివర్సిటీ ఇటీవల ప్రకటించిన మొదటి సెమిస్టరు పరీక్ష ఫలితాలలో 9.80 గ్రేడ్ పాయింట్లుతో ఏలూరు టౌన్ డిగ్రీ కళాశాలలో టాపర్ గా నిలిచినట్లు ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు తెలిపారు.ఆదిత్య డిగ్రీకళాశాలలో ప్రస్తుతం మొదటి సంవత్సరం బి.సి.ఎ (డి.న్) చదువుతున్న నల్లగొండ మధుశ్రీవల్లి,మొదటి సెమిస్టర్ నందు నన్నయ్య యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాలలో 9.80 గ్రేడ్ పాయింట్లుతో సాధించి ఏలూరు టౌన్ డిగ్రీ కళాశాలలో టాపర్గా నిలిచినట్లు ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు తెలిపారు.నన్నయ్య యూనివర్సిటీ టాపర్గా నిలిచిన నల్లగొండ మధుశ్రీవల్లి ని ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ డా:ఎన్. శేషారెడ్డి, సెక్రటరీ డా:ఎన్. సుగుణా రెడ్డి,అకడమిక్ డైరెక్టర్ డా:బి.ఇ.వి.యల్.నాయుడు, ఆదిత్య డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు,వైస్ ప్రిన్సిపాల్ డి.వి.వి.ఫణికుమార్, మరియు అధ్యాపక, ఆధ్యాపకేతర బృందం అభినందించారు.

