లూపస్పై అవగాహన అవసరం
1 min read
మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు నేడు వరల్డ్ లూపస్ డే
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 10న నిర్వహించే వరల్డ్ లూపస్ డే సందర్భంగా Medicover Hospitals Kurnool వైద్యులు లూపస్ (SLE – Systemic Lupus Erythematosus) అనే ఆటో ఇమ్యూన్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం థీమ్ “Make Lupus Visible” అనే సందేశంతో లూపస్ వ్యాధి గురించి సమాజంలో సరైన అవగాహన కల్పించడం, రోగుల సమస్యలను గుర్తించడం మరియు వారికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సందర్భంగా రుమటాలజిస్ట్ డా. సృజన గారు మాట్లాడుతూ, లూపస్ అనేది శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపే ఆటో ఇమ్యూన్ వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి వల్ల కీళ్ల నొప్పులు, తీవ్రమైన అలసట, చర్మంపై రాషెస్, జ్వరం, జుట్టు రాలడం, కిడ్నీలు మరియు ఇతర అవయవాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వివరించారు.వైద్యులు మాట్లాడుతూ, లూపస్ లక్షణాలు ప్రతి వ్యక్తిలో భిన్నంగా కనిపిస్తాయని, చాలాసార్లు వ్యాధిని గుర్తించడం ఆలస్యమవుతుందని తెలిపారు. ప్రారంభ దశలోనే సరైన పరీక్షలు మరియు చికిత్స తీసుకుంటే వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతులు మరియు మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని తెలిపారు.ఈ సంవత్సరం థీమ్ ప్రకారం లూపస్ వంటి “అదృశ్య వ్యాధులు” గురించి సమాజంలో అవగాహన పెంచడం చాలా ముఖ్యమని వైద్యులు పేర్కొన్నారు. లూపస్ రోగుల పట్ల అపోహలు తొలగించి, వారికి మానసికంగా మరియు సామాజికంగా మద్దతు ఇవ్వడం అవసరమని సూచించారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ,“లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులపై ప్రజల్లో సరైన అవగాహన చాలా అవసరం. ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స పొందితే రోగులు సాధారణ జీవితం గడపవచ్చు. మెడికవర్ హాస్పిటల్స్లో నిపుణులైన వైద్యులతో ఆధునిక చికిత్సలు అందిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.

