రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ..
1 min read
కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు, న్యూస్ నేడు: ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్, కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ లు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సంధర్బంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత , ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా , ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించారు. 2026 జనవరి 1 నుండి మే 8 వ తేదీ వరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఈ – చలనాలు నమోదు చేశారని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
ఈ క్రింది విధంగా
ఓవర్ స్పీడ్ చేసిన 3156 మంది పై ,హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 2569 మంది పై , సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసిన 857 మంది పై ఈ – చలాన్ జరిమానాలు నమోదు చేశారు. 3206 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు, 6217 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.

