NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెంకటేశ్వర స్వామి కళ్యాణం..

1 min read

పూజలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు

 చాగలమర్రి రూరల్  న్యూస్​ నేడు : మండల పరిధిలోని మూడు రాళ్లపల్లె గ్రామంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అనిల్ కుమార్ పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి, లక్ష్మీ లతో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. శ్రావణ నక్షత్రం  కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్వామి పల్లకి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు రిటైర్డ్ ఇంజనీర్ చిన్న ఓబుల్ రెడ్డి, పద్మావతి, ఓబుల్ రెడ్డి, విజయమ్మ విజయమ్మ దంపతులతో పాటు రామేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అరుణ, సుబ్బరాయుడు, వెంకట తులసమ్మ దంపతులు, శ్రీనివాసులు రజిత, నాగేంద్ర ప్రసాద్ నాగజ్యోతి, కార్తీక్ నాగ మంజుల రాణి తదితరులు పాల్గొన్నారు.

About Author