అలూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మే 14న సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
1 min read
హోళగుందన్యూస్ నేడు; అలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన అలూరు పట్టణంలోని ఆర్ & బీ సబ్‌డివిజన్ కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీపీఐ నాయకులు తెలిపారు.రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గంగా పేరున్న అలూరు ప్రాంతంలో అనేక గ్రామాలు తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు.విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు:జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శి బి. గిడ్డయ్య, హోలగుంద మండల సీపీఐ పార్టీ కార్యదర్శి పెద్దహెట్టి మారెప్ప, సీపీఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు కొత్తపల్లి గిడ్డయ్య, రైతు సంఘం నాయకులు లక్ష్మన్న, కారుమంచి పాల్గొన్నారు.

