NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి.. మంత్రి టీజీ భరత్ గుప్తా

1 min read

మన నగరం.. మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు నగరంలోని 8వ వార్డులో మన నగరం..మన బాధ్యత కార్యక్రమం పేరుతో మంత్రి ఇంటింటి పర్యటన చేపట్టారు. వార్డులో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టినట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే ప్రజలను నేరుగా కలవాలన్నారు. ప్రజలను కలిసి మాట్లాడుతుంటే రెండేళ్ల పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ తో ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. కర్నూలు నగరంలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నాం అన్నారు. అన్ని వార్డుల్లో ప్రాధాన్యత క్రమంలో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నాం అన్నారు.   ఇక చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో సచివాలయ ఉద్యోగుల విఫలం అయ్యారని మంత్రి అన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరు మార్చుకొని పని చేయకపోతే చర్యలు తీసుకుంటాం అన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రభుత్వానికి ముఖ్యం అని మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొరకంచి రవి, స్థానిక మాజీ కార్పొరేటర్ పరమేశ్, సీనియర్ నేతలు, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *