అదాని కోసమే స్మార్ట్ మీటర్లు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రజా వ్యతిరేక స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ బిల్లులను వసూలు చేస్తూ సామాన్య ప్రజలు తీవ్రమైన ఆర్థిక భారంతో సతమతమయ్యేటట్టు చేస్తున్నాయని బహుజన ముక్తి పార్టీ(BMP) ఆధ్వర్యం లో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జిల్లా పరిషత్ నిర్వహించిన నిరసన కార్యక్రమం “లాంతరు భేటీ(Lantern Meet)” లో బహుజన్ ముక్తి పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ రామ శేషయ్య, కో కన్వీనర్లు ఎన్ కే జయన్న, సిద్దయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్మార్ట్ మీటర్లు అదాని కోసమేనని, ఆర్థికంగా సామాన్య ప్రజలను ధ్వంసం చేయడం కోసమేనని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాది డాక్టర్ వివి సుబ్రహ్మణ్యం, విజయ భాస్కర్, రామాంజనేయులు, దినకర్, సునీల్,మహేష్,రాజన్న, శ్యామ్, రవి, నాయకంటి ఆనందం తదితరులు పాల్గొన్నారు.

