ప్రముఖ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన వైకుంఠం జ్యోతి
1 min read
ఆలూరు న్యూస్ నేడు: నెల్లూరులో నిర్వహించిన మహానాడు కమిటీ సభ్యుల సమావేశంలో ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే తుడా చైర్మన్ మరియు టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, మహానాడు ఏర్పాట్లు, ప్రజా సమస్యలు మరియు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


