ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిరసనకు పిలుపు
1 min read
ఏపి వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల గురవయ్య బండి వెంకటేశ్వరరావు పిలుపు
మార్పు రావాలి-మార్పు తేవాలి అనే నినాదంతో ఈనెల 21న జరిగే ఆందోళన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గ్రామీణ పేదలకు సామాజిక న్యాయం-ఆత్మగౌరవం కల్పించాలని కోరుతూ ఆగస్టు 21వ తేదీ న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బి కే ఎం యు) ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలకు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల గురవయ్య బండి వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు. మార్పు రావాలి–మార్పు తేవాలి అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈనెల 21న జరిగే ఆందోళన కార్యక్రమాలను మండలాలలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు పేద ప్రజల సమీకరించి పెద్ద ఎత్తున చేయాలని వారు కోరారు.పేద ప్రజలకు సాగుభూములు పంచాలని, దశాబ్దాల తరబడి సాగు చేస్తున్న భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, వి ఎస్ ఎస్ లో కేటాయించిన భూములను వైఎస్ఆర్ సభ్యులకు వ్యక్తిగత హక్కుపత్రాలు ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాలలో ఇంటి స్థలం లేని పేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. 2005లో సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కోరుతుందని గురవయ్య వెంకటేశ్వరరావు తెలిపారు.


