సెంట్రల్ లయన్స్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్
1 min read
ప్రజలు లయన్స్ సేవలను మరింతగా వినియోగించుకోవాలని
విభిన్న సంఘాల లీడర్-లయన్స్ రీజియన్ ఛైర్పర్సన్ ఇంజనీర్ దేవరకొండ వెంకటేశ్వర్లు
ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఏలూరు నవాబుపేట కాలనీలోని శ్రీ శయన కమ్యూనిటీ హాల్లో సెంట్రల్ లయన్స్ ఆధ్వర్యంలో జనరల్, ఆర్దో, తదితర విభాగాలకు సంబంధించి ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడమైనది. ముఖ్య అతిధి ఏలూరు శాసన సభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ చేస్తున్న సేవలను అభినందిస్తూ, ప్రజలు లయన్స్ సేవలను మరింతగా వినియోగించుకోవాలని సూచించారు.గౌరవ అతిధులుగా ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఇడా చైర్మన్ శివ ప్రసాద్, ఎస్మ్మార్ అధినేత పెదబాబు,స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై ఆశీస్సులు అందించారు. విశిష్ట అతిధులుగా సంఘ సేవకులు-విభిన్న సంఘాల లీడర్-లయన్స్ రీజియన్ ఛైర్పర్సన్ ఇంజనీర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, రీజియన్ సెక్రటరీ నాగ లక్ష్మి, జోన్ ఛైర్పర్సన్ సి.హెచ్. పావని హాజరై లయన్స్ సేవలను ప్రజలకు వివరించారు.కార్యక్రమ నిర్వాహకులుగా క్లబ్ ప్రెసిడెంట్ – సెక్రటరీలు శ్యామలపల్లి సుజాత,మహ్మద్ ముంతాజ్ బేగం వ్యవహరించారు. స్థానిక ఆర్.ఆర్.పేటలోని శ్రీకృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ బి. కృష్ణ, వైద్యులు దిలీప్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విద్య, పిఆర్వో సత్యనారాయణ,ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణలో రెండు వందల మందికి పైగా రోగులను పరీక్షించి,పది రోజులకు సరిపడే మాత్రలనుఉచితంగా అందించడమైనది.ఈ కార్యక్రమానికి శ్రీశయన సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు సంపూర్ణ సహకారా న్ని అందించారు.


