నేడు నియోజకవర్గ ఎంపీ సి యం ఆర్ ఫ్ చెకులు పంపిణీ కార్యక్రమం
1 min read
క్యాంపు కార్యాలయంలో ఉ:11గంలకు ప్రజా దర్బార్,ప్రజలు నుండి స్వయంగా వినతులు స్వీకరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గురువారం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10:00 గంటలకు సియంఆర్ ఫ్ చెక్స్ పంపిణీ కార్యక్రమంలోఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొంటారు. అనంతరం 11:00 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ లో పాల్గొని, ప్రజల నుండి అర్జీలు స్వయంగా స్వీకరిస్తారని, ప్రజలకు,నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు. కావున ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ని కలవాలని అనుకున్న లేదా మీ నియోజకవర్గం, మండలం లేదా మీ గ్రామంలో ఉన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చి మీ సమస్యలను పరిష్కరించుకోగలరని కోరారు.

