NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పొగాకు కంపెనీపై వచ్చిన ఆరోపణలు నమ్మొద్దు

1 min read

మాసపేట ఐటీసీ కంపెనీ వద్ద రైతులు..

మిడుతూరు(నందికొట్కూరు):  న్యూస్ నేడు:ఐటీసీ కంపెనీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని రైతులు అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట గ్రామంలో ఉన్న ఐటీసీ పొగాకు కంపెనీ ఎదుట ఓర్వకల్లు మండలం కన్నమడకల గ్రామానికి చెందిన రైతులు బుధవారం ఉదయం  పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కన్నమడకల మాజీ సర్పంచ్ చిక్కలి వెంకటేశ్వర్లు,రైతులు కల్లాల బాలకృష్ణ,పింజరి పెద్ద స్వామి మాట్లాడుతూ ఇతర కంపెనీకి చెందిన రైతులు గత మూడు రోజుల క్రితం ఇక్కడ ఐటీసీ కంపెనీ పొగాకు పంటకు ధర కల్పించడం లేదని నిరసన వ్యక్తం చేశారని మాకు ఈ కంపెనీ పొగాకు పంటకు మంచిధర కల్పిస్తూ కంపెనీ మాకు అండగా నిలుస్తుందని అన్నారు.వారు చెప్పే మాటలను రైతులు ఎవరూ కూడా నమ్మవద్దన్నారు. ఇలాంటి మాటలు వల్ల కంపెనీని నమ్ముకుని ఉన్న రైతులకు నష్టం వాటిల్లుతుందని అలాంటి అపోహలను నమ్మవద్దని అంతేకాకుండా గతంలో మా గ్రామ రైతులతో సమావేశమై కంపెనీ చెప్పిన విధంగానే రైతులు ఎంత పండించినా సరే పంటను పంటను కొంటున్నారని రైతులు అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద బాలమదిలేటి,పిక్కిలి వెంకటేశ్వర్లు,శ్రీనివాసులు, నాగరాజు,సురేష్,చిన్న శాలు, హరి తదితరులు పాల్గొన్నారు.

About Author