NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాంఘిక సంక్షేమ గురుకులాలలో పనిచేస్తున ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

1 min read

4 రోజులు శిక్షణాతరగతులు నిర్వహణ

అడిషనల్ సెక్రటరీ కె.రాజ్యలక్ష్మి , ఏయంఓ ఎస్.రూపవతి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి వారి ఆదేశాల ప్రకారం,ఏ పి ఎస్ డబ్యూ ఆర్ ఇ ఐ ఎస్,సెక్రెటరీ ప్రసన్న వెంకటేష్ వి. ఐఏఎస్, సాంఘిక సంక్షేమ గురుకులాలులో పనిచేస్తున్న మాథ్స్ మరియు సైన్స్ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు, ఇందుకుగాను కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ముంబై వారీ ద్వారా ఏఐ టూల్స్ ఉపయోగించి విద్యార్థులకు అత్యాధునికత విద్యను ఎలా అందించాలి, విద్యార్థులలో నాయకత్వ లక్షణాన్ని ఎలా పెంపొందించాలి అనే అంశంపై ప్రెవేట్ హోటల్  నందు 11.05.2026 నుండి  14.05.2026 వరకు శిక్షణా తరగతులు నిర్వహించారని యన్.భారతి, డిస్టిక్ కో-ఆర్డినేటర్ ఏ పి ఎస్ డబ్యూ ఆర్ ఇ ఐ ఎస్,ఏలూరు మరియు పశ్చిమగోదావరి జిల్లా వారు గురువారం తెలిపారు.  ఈ శిక్షణలో ఏలూరు, పశ్చిమగోదావరి తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లాలులో ఉన్నటువంటి మ్యాథ్స్ మరియు సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.అడిషనల్ సెక్రటరీ కె.రాజ్యలక్ష్మి , మరియు ఏయంఓ ఎస్.రూపవతి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *