NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ కృష్ణ సోలార్ ను ప్రారంభించిన డీఈ

1 min read

-పూర్తి సబ్సిడీతో సోలార్ ఏర్పాటు..

నందికొట్కూరు న్యూస్ నేడు: వంద శాతం సబ్సిడీతో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా చేపడుతున్న సోలార్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నందికొట్కూరు విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాసులు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కొత్త బస్టాండ్ ఎదురుగా గురువారం మధ్యాహ్నం శ్రీ కృష్ణ సోలార్ షాపును రిబ్బన్ డీఈ శ్రీనివాసులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ నందికొట్కూరులో మొదటిసారిగా నూతనంగా శ్రీ కృష్ణ సోలార్ షాప్ ప్రారంభించడం జరిగిందని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.సౌర శక్తితో స్వయం సమృద్ధి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో నెలకు 360 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందని సోలార్‌పై భారీ సబ్సిడీలు..3 కిలోవాట్ల వరకు గరిష్టంగా 78 వేల రాయితీ, మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికే విక్రయించి అదనపు ఆదాయం పొందే ఛాన్స్ ఉందన్నారు.వంద శాతం బ్యాంక్ లోన్ సౌకర్యంమీరు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి మీ జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు.మొత్తం ఖర్చును బ్యాంకే భరిస్తుంది.​పెరుగుతున్న విద్యుత్ ధరల నుండి రక్షణ ​ప్రతి సంవత్సరం ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచుతూనే ఉంటుంది.కానీ సోలార్ పెట్టుబడి వల్ల భవిష్యత్తులో పెరిగే విద్యుత్ బిల్లుల భయం మీకు ఉండదన్నారు.ఇది మీ దీర్ఘకాలిక పొదుపుగా భావించాలనిడిఈ శ్రీనివాసులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈ రాజేష్ గౌడ్,నందికొట్కూరు సోలార్ బ్రాంచ్ హెడ్ నవీన్ కుమార్ యాదవ్,బనగానపల్లె బ్రాంచ్ మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *