సర్వేను పరిశీలించిన జిల్లా అధికారి డాక్టర్ కాంతారావు
1 min read
17 నుండి బీపీ రక్తపోటు వారోత్సవాలు..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: క్యాన్సర్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్ సిడిసిడి జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాంతారావు నాయక్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో జరుగుతున్న సర్వేను జిల్లా అధికారి గురువారం పరిశీలించారు.మిగిలిన 10 శాతం సర్వేను త్వరగా పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. అనుమానిత క్యాన్సర్ రోగులను గుర్తించి వెంటనే వారిని నంద్యాల,కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలన్నారు.ఈనెల 17వ తేదీ నుండి బీపీ రక్తపోటు వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని అన్నారు.తర్వాత కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.సిబ్బందికి తగిన సలహాలు సూచనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, డాక్టర్ వ్యోమకేష్,సిహెచ్ఓ సురేష్,పీహెచ్ఎన్ గురుదేవి, సూపర్వైజర్ ఏసేపు,రామ తులసి మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


