చిప్పగిరిలో ఘనంగా కందూరి మహోత్సవం – ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే
1 min read
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం & గ్రామంలో నిర్వహించిన శ్రీ భం భం బాబా స్వామి వారికి మరియు శ్రీ సత్తార్ స్వామి వారికి కందూరి మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుసినే విరూపాక్షి హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని మతాల పండుగలు సామరస్యానికి ప్రతీకలని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం భక్తులను, గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించి కందూరి మహోత్సవ ఏర్పాట్లను అభినందించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

