జొన్నగిరి బంగారుగనులను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
1 min read
ఏడాదికి 600 నుండి 1500 కేజీల బంగారు ఉత్పత్తి
న్యూస్ నేడు, పత్తికొండ: కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును రాష్ట్ర గనుల శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.దేశ చరిత్రలోనే తొలి ప్రైవేట్ బంగారు గని జొన్నగిరిలో సిద్ధమవుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో వచ్చే నెలలోనే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుందని వెల్లడించారు.ఈ ఏడాది 600 కేజీల బంగారం, వచ్చే ఏడాది 1500 కేజీల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన బంగారంలో 50 నుంచి 60 శాతం వరకు ఇక్కడి నుంచే ఉత్పత్తి అయ్యే అవకాశముందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి మరియు యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భూసేకరణ విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని, గ్రామసభ అనుమతి తప్పనిసరిగా తీసుకుంటామని తెలిపారు. దేశానికి బంగారం దిగుమతుల భారం తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.జొన్నగిరిని దేశంలోనే ప్రముఖ గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జొన్నగిరి బంగారు గని పనులు వేగంగా.


