NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిసరాలు పరిశుభ్రత లేకపోతే మనకు అంటు రోగాలు వస్తాయి

1 min read

నిర్ణీత దూరంలో ప్రతి ఇల్లు కవరు అయ్యేలా డస్ట్ బిన్లు ఏర్పాటు చెయ్యాలి

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కైకలూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా సోమవారం బైపాస్ రోడ్డు గంగానమ్మ గుడివద్ద రోడ్లమీద చెత్త ఉండడం చూసి వెంటనే కారుదిగి ఇంటింటికి వెళ్ళి రోడ్లమీద చెత్తఎవ్వరూ వేశారని, ఇలా వెయ్యడం వలన పరిసరాలు పరిశుభ్రత లేకపోతే మనకు అంటు రోగాలు వస్తాయని జిల్లా కలెక్టరు హితవు పలికారు. నిర్ణీత దూరంలో చెత్త డస్ట్ బిన్లు ఏర్పాట్లు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు,  తడి,పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాలని ప్రజలకు జిల్లా కలెక్టరు సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ  రోడ్డులు మీద, దుకాణాలు వద్ద ఇష్టానుసారంగా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయడం వలన పరిసరాలు కాలుష్యానికి గురై ప్రజలు ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతుందని అన్నారు. ఇంటివద్ద, దుకాణాలలో ఏర్పడే చెత్తను ఒకేచోట సేకరించి, గ్రామ పంచాయతీ  సిబ్బందికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్లపై మరియు ఇంటి బయట చెత్తవేయడం వలన ఈగలు, దోమలు పెరిగి దుర్వాసన వ్యాపిస్తుందని, తద్వారా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పట్టణ, గ్రామ పరిశుభ్రత పరిరక్షణలో ప్రతి కుటుంబ, ప్రతి వ్యాపారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే మొదటి తప్పుగా వారికి నచ్చజెప్పి అవగాహన కల్పించాలని అన్నారు. రెండవసారి పునరావతం అయితే అపరాధ రుసుములు విధించాలని అన్నారు. ప్రజా ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు.ఈ సందర్భంలో ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిషోరు, సంబంధిత శాఖలు అధికారులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *