మహానాడు కార్యక్రమం పర్యవేక్షణ నియమితులుగా శొంఠి శివ రామ ప్రసాద్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పత్తిపాడు నియోజకవర్గo పరిశీలకులుగా రాష్ట్ర గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ నీ మహానాడు కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర పార్టీ కార్యాలయం నియమించింది. నియోజకవర్గంలోని 12 క్లస్టర్ లతో జూమ్ మీటింగ్ పెట్టి,రాష్ట్ర పార్టీ పంపించిన మెటీరియల్ స్థానిక శాసనసభ్యులు ద్వారా క్లస్టర్లకు అందజేసి, కళ్యాణ మండపాలను, ఏర్పాటు లను పరిశీలించి వారితో సమావేశం ఏర్పాటు చేశారు.శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఒక పండుగ లాంటిదని, అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమం ఒక పండుగలా జరుపుకుంటున్నామని తెలిపారు. యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడటం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మహానాడు కార్యక్రమం జూమ్ మీటింగ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు అని తెలిపారు. మహానాడు కార్యక్రమం 27, 28 తారీకులు రెండు రోజులు జరుగుతాయని, క్లస్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం కళ్యాణ మండపాలలో స్క్రీన్ లు ఏర్పాటుచేసి, జూమ్ మీటింగ్ ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అన్ని నియోజక వర్గాల నాయకులతో, కార్యకర్తలతో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ విధి విధానాలతో చర్చిస్తారని, పార్టీ పెద్దలు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారని తెలిపారు.జూమ్ మీటింగు వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు భోజన ఏర్పాట్లు చేయాలని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం రెండు రోజులు జరుగుతుందన్నారు. 28 వ తారీకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి, పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు.ఈ కార్యక్రమం రెండు రోజులు నియోజకవర్గ మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా పసుపుమయం కావాలని, జెండాలు, ఫ్లెక్సీలు,తోరణాలతో నిండిపోవాలన్నారు.ప్రతి నియోజకవర్గంలో నుండి ప్రజా సమస్యలు,పార్టీ సమస్యలపై తీర్మానాల రూపంలో నియోజకవర్గాల వారీగా రాష్ట్ర పార్టీకి అందజేయడం జరుగుతుందని, వాటిని జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు , రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పరిశీలించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.కావున నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా క్లస్టర్ల వారీగా రెండు రోజులు జరిగే మహానాడు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

