NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే – అత్యవసర వైద్య సేవల ప్రాముఖ్యత

1 min read

– మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 27న నిర్వహించే వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు వైద్యులు అత్యవసర వైద్య సేవల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం థీమ్ “Safe Space for Emergency Medicine Teams” అనే సందేశంతో అత్యవసర విభాగంలో పనిచేసే వైద్యులు, నర్సులు మరియు సిబ్బందికి సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడం ఎంతో ముఖ్యమని తెలియజేస్తోంది.ఈ సందర్భంగా కన్సల్టెంట్ & హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డా. టి.వి. సునీల్ యాదవ్  మాట్లాడుతూ, ఎమర్జెన్సీ విభాగం ప్రతి ఆసుపత్రిలో అత్యంత కీలకమైన విభాగమని తెలిపారు. ప్రమాదాలు, గుండెపోటు, స్ట్రోక్, విషప్రయోగాలు మరియు ఇతర ప్రాణాపాయ పరిస్థితుల్లో సమయానికి అందించే అత్యవసర వైద్య సేవలు ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఎమర్జెన్సీ వైద్య బృందాలు అధిక ఒత్తిడి పరిస్థితుల్లో నిరంతరం సేవలందిస్తుంటాయని, వారికి సురక్షితమైన వాతావరణం మరియు సమాజం నుండి గౌరవం లభించడం ఎంతో అవసరమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బందిపై హింస, దురుసు ప్రవర్తన వంటి ఘటనలు తగ్గేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.డా. సునీల్ యాదవ్ ఇంకా మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించడం, ప్రాథమిక చికిత్సపై అవగాహన కలిగి ఉండటం మరియు గోల్డెన్ అవర్‌లో సరైన చికిత్స అందించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్  మహేశ్వర్​ రెడ్డి  మాట్లాడుతూ, “ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ఆరోగ్యరంగానికి ప్రాణాధారం లాంటిది. అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే వైద్య బృందాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం సమాజ బాధ్యత. మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక ఎమర్జెన్సీ సేవలతో ప్రజలకు 24 గంటలు వైద్య సహాయం అందిస్తున్నాం” అని తెలిపారు.

About Author