NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వాతంత్ర్య సమరయోధులు, సంకు అప్పారావు 35వ వర్ధంతి

1 min read

సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే

సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ శాసనమండలి సభ్యులు సంకు అప్పారావు 35వ వర్ధంతి, స్వాతంత్ర్య సమరయోధులు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కనకం సోం బసవరాజు 25వ వర్ధంతి కార్యక్రమం ఆర్.ఆర్.పేట కనకం వారి వీధి,సంకు అప్పారావు విగ్రహం వద్ద ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన జరిగినది.సంకు అప్పారావు విగ్రహానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కనకం సోం బసవరాజు చిత్రపటానికి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ సంకు అప్పారావు,జోహార్ కనకం సోం బసవరాజు, అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీని నిర్మాణం చేయడంలో వంక సత్యనారాయణ, కపర్తి వంటి అగ్రగణ్యులతో కలిసి సంకు అప్పారావు ప్రధాన భూమిక పోషించారని కొనియాడారు. సంకు అప్పారావు రైతు సంఘం నాయకునిగా రాష్ట్రవ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ నిర్మాణ బాధ్యునిగా పనిచేసి అక్కడ పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసిన కనకం సోం బసవరాజు రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను నిర్వహించారని తెలిపారు. వారు మన ముందు వదిలిన ఆశయాలను సాధించడమే వారికి అందించే ఘనమైన నివాళి అని తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు సంకు అప్పారావు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి విస్తరణకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్,అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు సంకు అప్పారావు,కనకం సోం బసవరాజు వంటి ఆ తరం కమ్యూనిస్టు పార్టీ  నాయకులు చేసిన పోరాటాలను, ఉద్యమాలను మననం చేసుకుంటూ నేడు ప్రతి ఒక్క కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఏలూరు ఏరియా సమితి కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, కనకం జగన్మోహన్రావు,యర్రా వెంకటేశ్వరరావు,గేదెల నాగేశ్వరరావు, బి.శ్రీదేవి,మోరు రామకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *