1,2 డివిజన్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
1 min read
సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్
సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఒకటి, రెండు డివిజన్ల సంయుక్త సమావేశం బృందావన్ గార్డెన్స్ ఎదురుగా లక్కోజు జగదీశ్వరి ఇంటి వద్ద జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ గతంలో వెంకటాపురం పంచాయతీలో ఉన్న ఈ ప్రాంతాన్ని 2021 పంచాయతీల విలీనం తర్వాత ఒకటవ డివిజన్,రెండవ డివిజన్ గా ఏర్పాటు చేశారని తెలిపారు. ఆనాటి నుండి ఈ ప్రాంతంలో రోడ్లు,డ్రైనేజీ,వీధి దీపాలు, మంచి నీరు వంటి కనీస మౌలిక వసతులు మెరుగుపరచకుండా కార్పొరేషన్ వారు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కొమడవోలు ప్రభుత్వ కాలనీలో ఇంటి నిర్మాణాల కోసం నిరంతరం పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతున్నా రోడ్లు వెడల్పు చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం చెందిందని విమర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ వారు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు పరిష్కారం కోసం వచ్చే నెల జూన్ 9వ తేదీన ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ ఏరియా సమితి సర్వసభ్య సమావేశం జరుగుతుందని సమావేశాన్ని జయప్రదం చేయడం కోసం ఒకటి,రెండు డివిజన్ల నుండి విస్తృతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మి ఇందిరా మాట్లాడుతూ ఒకటి రెండు డివిజన్లో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో జరిగిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని పరిష్కారం అయ్యేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దేశంశెట్టి అమ్మాజీ,ఆర్. రంగమ్మ, ఏ.దుర్గ, పి.చంద్రకళ, సత్యరావు, జి జ్యోతి,కే.పార్వతి, ఏ.రామలక్ష్మి, సరస్వతి,కొచ్చర్ల ఉమా,ఏ.నాయుడు తదితరులు పాల్గొన్నారు.


