NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమాధానం చెప్పాల

1 min read

ఉద్యోగార్థులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి

ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరూపాక్షి

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలలో చోటుచేసుకున్న అవకతవకలు, పారదర్శకత లోపాలు మరియు నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయాలపై స్థానిక వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా ప్రతినిధులతో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే  బుసినే విరూపాక్షి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  బుసినే విరూపాక్షి  మాట్లాడుతూ..“చంద్రబాబు .. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా..? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా..? పారదర్శకత ఎక్కడుంది..?” అని ప్రశ్నించారు.డీఎస్సీ నిర్వహణలో అనేక అనుమానాలు తలెత్తాయని, పేపర్లు లీక్ కావడం, డేటా డిలీట్ చేయడం, మెరిట్ లిస్టులను మాయం చేయడం వంటి పరిణామాలు యువతలో తీవ్ర ఆందోళన కలిగించాయని అన్నారు.మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, తిరిగి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి రాజకీయ ప్రచారానికి వాడుకున్నారని ఆరోపించారు. చివరికి పరీక్షల నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెంది ఉద్యోగార్థులకు అన్యాయం చేశారని విమర్శించారు.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన “డార్క్ ఆపరేషన్”ను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. పరీక్ష నిర్వహణలో చురుకుగా పాల్గొన్న SCERT అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికే మొదటి ర్యాంకు రావడం వెనుక ఉన్న నిజాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు తొలగించారో, మెరిట్ లిస్టులను ఎందుకు దాచారో, టాపర్ వివరాలను ఎందుకు డిలీట్ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు పంపడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని నిలదీశారు.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా” పోస్టుల బేరసారాలు జరిగాయన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, మీ పార్టీ నాయకులే ఈ డీల్స్ కుదిర్చారన్న వార్తలు వస్తున్నాయని అన్నారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు కట్టబెట్టారా అని ప్రశ్నించారు.టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారిని అకస్మాత్తుగా తప్పించి, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు నియమించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.“మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి”కి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ను వెంటనే పదవి నుంచి తప్పించి, మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతిభ చూపిన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *